మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కర్నాటక క్రికెటర్ అర్జున్ హొయసలాతో వేద.. కోర్టు వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. వేదా మరియు అర్జున్ ల ప్రేమకథ గత ఏడాది సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చింది. అర్జున్ ఒక మోకాలిపై కూర్చొని వేదాను ప్రపోజ్ చేయడంతో... పాటు ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో.. తమ బంధాన్ని అప్పుడే అందరికీ తెలిపారు. (Veda Krishnamurthy/Instagram)
ఈ ఇద్దరు కోర్టులో వివాహం చేసుకున్నారు. కోర్టు వివాహం తర్వాత తమ ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. "మిస్టర్ అండ్ మిసెస్ !!! ఇది నీ కోసమే అమ్మా. ఈ రోజు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. లవ్ యూ అక్కా ఇప్పుడే పెళ్ళయ్యింది." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. వేద అమ్మ.. అక్కా వైరస్ తో మరణించిన సంగతి తెలిసిందే. అర్జున్ ఫోటోల్ని పంచుకుంటూ మేము కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.. (Veda Krishnamurthy/Instagram)
ఇక.. 33 ఏళ్ల అర్జున్ హొయసలా కర్ణాటక తరఫున ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. అయితే, అర్జున్ కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. అతను 2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు. 2016లో మహారాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున అర్జున్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. (Veda Krishnamurthy/Instagram)