భారత మహిళా క్రికెటర్లలో అందగత్తె ఎవ్వరంటే ముందుగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన, ఆ తర్వాత ఓపెనర్ ప్రియా పునియా. అయితే, టీమిండియా లో మరో అమ్మాయి కూడా కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. ఆ అమ్మాయే హార్లిన్ డియోల్ (Harleen Deol). ఛండీఘర్ కి చెందిన ఈ బ్యూటీ ఇప్పటి దాకా 13 టీ-20లు , ఒక వన్డే మాత్రమే ఆడింది. (Harleen Deol/Instagram)
అందుకే ఫ్యాన్స్ కోసం తన క్యూట్ ఫోటోలను తెగ పోస్ట్ చేస్తోంది హార్లిన్. లేటెస్ట్ గా హార్లీన్ ఫోటోలు ఇప్పుడు కుర్రకారును కవ్విస్తున్నాయ్. లేడీ క్రికెటర్లు తమ పెళ్లికి ముందు ఇలా పోజులిస్తారు. దీంతో.. హార్లిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. (Harleen Deol/Instagram)
హర్లీన్ డియోల్ 2019 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. అదే ఏడాది మార్చిలో టీ20ల్లోకి అడుగుపెట్టింది. హర్లీన్ తన ఎనిమిదేళ్ల వయసులో గల్లీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. తన అన్న, వీధిలోని అబ్బాయిలతో కలసి క్రికెట్ ఆడుతూ ఉండేది. (Harleen Deol/Instagram)
కేవలం ఒక ఏడాది గల్లీ క్రికెట్ ఆడిన హర్లీన్.. ఏడాది తర్వాత తన స్కూల్ తరపున జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించింది. హర్లీన్కు 13 ఏళ్లు ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్కు వెళ్లి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. ఆటలు ఆడుతూనే చదువుల్లో కూడా హర్లీన్ చాలా ముందుండేది. 10, 12వ తరగతుల్లో 80 శాతం పైగా మార్కులు తెచ్చుకొని బెస్ట్ స్టుడెంట్ అనిపించుకుంది. (Harleen Deol/Instagram)