Sania Mirza: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ కన్ఫామ్ అయింది. రిటైర్మెంట్ ప్రకటిస్తుందని ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను ఇప్పుడు నిజం చేసింది హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్. పదవి విరమణ ఎప్పుడంటే..
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ కన్ఫామ్ అయింది. తాను టెన్నిస్ మైదానానికి గుడ్ బై చెప్పడానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. రిటైర్మెంట్పై ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను ఇప్పుడు నిజం చేసింది హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్. (Photo:Instagram)
2/ 13
36ఏళ్ల సానియా మీర్జా గతేడాది చివర్లో మోచేయి గాయం కారణంగా రాకెట్‌ని పక్కనపెట్టింది. అదే కారణంతో యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉంది. ఆగస్ట్ 2022లో ఆడిన మ్యాచ్‌తోనే టెన్నిస్ మైదానంలో అడుగుపెట్టలేదు. (Photo:Instagram)
3/ 13
ఒకప్పటి డబుల్స్ నెంబర్ ప్లేయర్ సానియా మీర్జా ఈ ఏడాది ఫిబ్రవరి 19న దుబాయ్‌లో ప్రారంభమయ్యే (డబ్లూటీఏ1000)దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఈవెంట్ తర్వాత తన ఫ్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా వెల్లడించారు సానియా మీర్జా.(Photo:Instagram)
4/ 13
ఇప్పటి వరకు ఆరు సార్లు మేజర్ ఛాంపియన్- డబుల్స్‌లో ఆడింది సానియా మీర్జా. మూడు సార్లు మిక్స్డ్ డబుల్స్‌లో తనతో కలిసి ఆడిన కజకిస్తాన్‌కు చెందిన అన్నా డానిలినాతో కలిసి ఈ నెల ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోటీ చేయడానికి సైన్ అప్ చేసింది.(Photo:Instagram)
5/ 13
పదేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న సానియామీర్జా టెన్నిస్ స్టార్ ఇక ఆటకు గుడ్ బై చెప్పి ఎమిరేట్స్‌లో క్రీడకు వీడ్కోలు పలకాలని చూస్తుంది. అక్కడ తనకున్నభారీ అభిమానుల సంఖ్య మధ్య తన రిటైర్మెంట్ ప్రకటన చేయాలని డిసైడ్ అయింది మీర్జా.(Photo:Instagram)
6/ 13
సానియా మీర్జాకు ఉన్న స్వల్ప ఇబ్బందుల కారణంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం లేదని...కేవలం తన ఆట విషయంలో తనకున్న లక్ష్యాలను అధిగమించడం కారణంగానే వైదొలగుతున్నట్లుగా వరల్డ్ టెన్నిస్.కామ్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వూలో వెల్లడించింది. (Photo:Instagram)
7/ 13
దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ముగిసిన వెంటనే తాను ఆటకు స్వస్తి పలుకుతున్నట్లుగా ప్రకటించారు సానియా మీర్జా. ఈ టోర్నీలో ఫైనల్‌కి వెళ్లాలంటే ముందుగా యూఎస్ ఓపెన్ చేజార్చుకున్న అవకాశాన్ని అధిగమించాలని తెలిపారు.(Photo:Instagram)
8/ 13
అంతే కాదు సానియా మీర్జా తన లైఫ్‌ను గాయాల కారణంగా రిటైర్మెంట్ ప్రకటించాననే అపవాదు తనపై రాకూడదని..కేవలం వ్యక్తిగత జీవితాన్ని గడపటం కోసం తన ఇష్టపూర్వకంగానే వైదొలగడం మంచిదని భావిస్తున్నట్లుగా తెలిపారు సానియా మీర్జా.(Photo:Instagram)
9/ 13
చివరిగా ఆడే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు తగిన ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లుగా మీర్జా ఆ ఇంటర్వూలో తెలిపారు. తన రిటైర్మెంట్ ప్రకటనకు దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ వేదికే సరైనదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. (Photo:Instagram)
10/ 13
శరీరానికి అయిన గాయాలతో పాటు ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు తాను మానసికంగా సిద్దంగా లేనని బాహాటంగా చెప్పారు మీర్జా. 2003లో ఆట మొదలుపెట్టిన సానియామీర్జా ఇరవై ఏళ్లుగా తన శరీరాన్ని ఆటకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నానని చెప్పారు. (Photo:Instagram)
11/ 13
36ఏళ్ల టెన్నిస్ స్టార్ పాక్ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ని 2010లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి 2018లో సానియా మీర్జాకు ఇజాన్ పుట్టాడు. ప్రస్తుతం నాలుగేళ్ల కొడుకుతో దుబాయ్‌లో ఉంటోంది.అక్కడే టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది.(Photo:Instagram)
12/ 13
సింగిల్స్‌లో ప్రపంచంలోనే 27వ ర్యాంక్ సాధించిన సానియా మీర్జా...టెన్నిస్‌ని ప్రతి ఇంట్లో ఫేవరెట్ గేమ్‌గా మార్చేందుకు కృషి చేయాలని చూస్తున్నట్లుగా తెలిపారు. దుబాయ్, హైదరాబాద్ రెండు తనకు రెండు కళ్లతో సమానమని చెప్పింది సానియా మీర్జా.(Photo:Instagram)
13/ 13
రిటైర్మెంట్ తర్వాత సానియా మీర్జా దుబాయ్‌లోనే సెటిలవుతారా లేక హైదరాబాద్ వస్తారా..ఇక్కడ కూడా టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేస్తారా లేదా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రాలేదు. అయితే తన టెన్నిస్ అకాడమీని మరింత విస్తరింపజేయాలని మాత్రం చూస్తున్నారట..(Photo:Instagram)