విరాట్ "జెర్సీ నోస్ నో జెండర్"కు హీనా సిద్ధూ సపోర్ట్

విరాట్ కొహ్లీ ఆరంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"‌కు సోషల్ మీడియాలో సూపర్ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ సెలబ్రెటీల సపోర్ట్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ క్యాంపెయిన్‌కు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్‌ అయింది. 2018 ఉమెన్స్ వరల్డ్‌ కప్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్‌కు మద్దతు తెలపడానికి ఈ క్యాంపెయిన్‌ను...టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ స్టార్ట్ చేశాడు. విరాట్ "జెర్సీ నోస్ నో జెండర్"కు భారత స్టార్ షూటర్ హీనా సిద్ధూ మద్దతు తెలిపింది. కండలు బిగించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి...భారత మహిళా క్రికెట్ జట్టుకు మద్దతు తెలిపింది.ఈ క్యాంపెయిన్‌‌లో ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, స్క్వాష్ క్వీన్ దీపికా పల్లికల్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, స్టార్ బాక్సర్ మేరీ కోమ్, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, రెజ్లర్ వినేష్ ఫోగట్, భారత క్రికెటర్లు కె ఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ సైతం భాగమయ్యారు. బాలీవుడ్ స్టార్ సుశాంగ్ సింగ్ రాజ్‌పుత్, బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ సైతం టీమిండియా ఉమెన్స్ టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచారు. భారత క్రీడా దిగ్గజాలు,స్పోర్ట్స్ స్టార్స్ సపోర్ట్‌తో "జెర్సీ నోస్ నో జెండర్" క్యాంపెయిన్ సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌‌గా మారింది