IPL Schedule 2023: ఈసారి హైదరాబాద్లో 7 ఐపీఎల్ మ్యాచ్లు.. ఎప్పుడు? ఏ జట్టుతో..? పూర్తి వివరాలు
IPL Schedule 2023: ఈసారి హైదరాబాద్లో 7 ఐపీఎల్ మ్యాచ్లు.. ఎప్పుడు? ఏ జట్టుతో..? పూర్తి వివరాలు
IPL Schedule 2023 | Sun Riders Hyderabad: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. లీగ్ దశలో 56 రోజుల పాటు 70 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో ఏడు మ్యాచ్లు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి పొట్టి క్రికెట్ సంగ్రామం మొదలుకానుంది. లీగ్ దశలో 10 జట్ల మధ్య.. మొత్తం 70 మ్యాచ్లు జరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
కరోనా కారణంగా మూడేళ్ల పాటు హైదరాబాద్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరగలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో మళ్లీ.. అన్ని ఫ్రాంచైజీల సొంత మైదానాల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఈసారి హైదరాబాద్లో మొత్తం ఏడు మ్యాచ్లు జరగనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
1. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 2, 2023 (ఆదివారం) .. మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
2. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 9, 2023 (ఆదివారం).. రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
3. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 18, 2023 (మంగళవారం).. రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
4. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 24, 2023 (సోమవారం).. రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
5. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, మే 4, 2023 (గురువారం), రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
5. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్, మే 13, 2023 (శనివారం), మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
7. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 18, 2023 (గురువారం), రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
లీగ్ దశలో హైదరాబాద్ జట్టు.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో మ్యాచ్లు లేవు. ఈ నేపథ్యంలో లీగ్ దశ మ్యాచ్ల్లో హైదరాబాద్ స్టేడియంలో ఎంఎస్ ధోనీని చూసే అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
హైదరాబాద్ జట్టు లీగ్ దశలో ఆడనున్న మ్యాచ్ల వివరాలు (Image: Twitter/SunRisers)