దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక, ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు మన ఒలింపిక్ హీరోలు. టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని ఈ సందర్భంగా మోదీ భారత అథ్లెట్లను ప్రశంసించారు.