టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులో కీలకమైన ఆటగాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడటానికి ప్రస్తుతం ఇంగ్లాండ్ వెళ్లాడు. 2007లో బంగ్లాదేశ్‌తో ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ టెస్ట్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇషాంత్ శర్మ వన్డే, టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. కానీ టెస్టు జట్టులో తీసుకోవడానికే సెలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్ని ఏళ్ల క్రికెట్ కెరీర్లో తనను తాను ఒక మంచి బౌలర్‌గా మార్చుకున్నాడు. 2011లో ఇషాంత్ శర్మ ప్రతిమతోప్రేమలో పడ్డాడు. (Pratima singh/Instagram)
ఇషాంత్ శర్మ, ప్రతిమ సింగ్ మొదటి సారి 2011లో ఒకరిని ఒకరు కలుసుకున్నారు. ఢిల్లీలో ఐజీఎంఏ బాస్కెట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన లీగ్ మ్యాచ్‌కు ఇషాంత్ చీఫ్ గెస్టుగా వెళ్లాడు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇషాంత్ స్నేహితుడు. అక్కడ ప్రతిమతో పాటు ఆమె ముగ్గురు చెల్లెల్లు కూడా ఉన్నారు. ఇషాంత్ ప్రతిమను తొలి సారి అక్కడే చూశాడు. ఆ సమయంలో ఆమె భారత్ తరపున బాస్కట్ బాల్ ఆడిన విషయం ఇషాంత్‌కు తెలియదు. (Pratima singh/Instagram)
ప్రతిమను చూసిన తొలి చూపులోనే ఇషాంత్ ఆమె ప్రేమలో పడిపోయాడు. గాయం కారణంగా ప్రతిమ ఆ మ్యాచ్ ఆడటం లేదు. కానీ, మ్యాచ్ స్కోరర్‌గా పనిచేస్తున్నది. ఒక కుర్చీలో కూర్చొని స్కోర్ నమోదు చేస్తున్న ప్రతిమనే ఇషాంత్ చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రతిమకు ఇషాంత్ మీద చాలా కోపం వచ్చిందట. ఎందుకంటే ఇషాంత్ అక్కడ ఉండటంతో ఎవరూ బాస్కెట్ బాల్ మ్యాచ్ చూడకుండా అతడినే గమనిస్తూ ఉన్నారంటా. (Pratima singh/Instagram)
ఇక అప్పటి నుంచి ఇషాంత్ శర్మ ప్రతీ రోజు ప్రతిమను చూడటానికి ఆ బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌కు వెళ్లాడట. నెమ్మదిగా ప్రతిమతో స్నేహం పెంచుకున్న ఇషాంత్ ఒక ఏడాది పాటు ఆమెతో మాట్లాడుతూ గడిపాడు. ఒక రోజు ధైర్యం తెచ్చుకొని తన మనసులో మాట ప్రతిమకు చెప్పేశాడు. ప్రతిమ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడి ప్రేమకు ఓకే చెప్పింది. నేను ఇషాంత్ శర్మను మొదటి నుంచి గమనిస్తున్నాను. అతడి స్వభావం నాకు చాలా నచ్చింది. అందుకే ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పుకున్నాను అని ప్రతిమ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. (Pratima singh/Instagram)