Women's T20 Challenge: యూఏఈలో టీమిండియా మహిళా క్రికెటర్ల సందడి

Women's T20 Challenge : యూఏఈ వేదికగా మరో పొట్టి క్రికెట్ సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఐపీఎల్‌ లీగ్ దశ పోరు ముగిసిన వెంటనే.. ఉమెన్ టీ20 ఛాలెంజ్ ప్రారంభం కానుంది. నవంబరు 4 నుంచి 9 వరకు షార్జా వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం హర్మన్‌ప్రీత్, స్మృతి మందాన, మిథాలి రాజ్ సహా 30 మంది మహిళా క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు.