భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి అయ్యాడు. అతని భార్య నూపూర్ నగార్ నవంబర్ 24న ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. దీనితో, భువనేశ్వర్ కుమార్ టీమ్ ఇండియా స్పెషల్ ప్లేయింగ్ XIలో భాగమయ్యాడు, ఎందుకంటే టీమ్ ఇండియాలోని క్రికెటర్లు అందరూ ఈ మధ్య ఆడపిల్లలకు తండ్రులయ్యారు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ మరియు ఉమేష్ యాదవ్ కుమార్తెలకు తండ్రులయ్యారు. తాజాగా భువీ ఆ లిస్టులో చేరిపోయాడు. (Instagram)
భువనేశ్వర్ కుమార్ 24 నవంబర్ 2021న ఒక కుమార్తెకు తండ్రి అయ్యారు. అతని భార్య నుపుర్ నగర్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భువనేశ్వర్, నూపూర్ దంపతులు తమ కూతురు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, భువనేశ్వర్ తన కుమార్తె చిత్రాలను ఇంకా షేర్ చేయలేదు (Bhuvneshwar Kuma/Instagram)
భారత క్రికెట్ జట్టు టెస్ట్ స్పెషలిస్ట్ మరియు 'మోడరన్ వాల్'గా ప్రసిద్ధి చెందిన చతేశ్వర్ పుజారా కూడా 2018లో కుమార్తెకు తండ్రి అయ్యాడు. చతేశ్వర్ పూజారా మరియు పూజా పాబ్రీ 13 ఫిబ్రవరి 2013న వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత అంటే 2018లో వారి ఇంట్లో ఒక కూతురు పుట్టింది. ఆ పాపకు ఆ దంపతులు అదితి అని పేరు పెట్టారు. (Cheteshwar Pujara/Instagram)
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 2015లో ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు. అతని భార్య హసిన్ జహాన్ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుమార్తెకు జన్మనిచ్చింది. షమీ కూతురు పేరు ఐరా. ప్రస్తుతం షమీ, అతని భార్య మధ్య గొడవలు జరుగుతుండటంతో అతని కూతురు భార్య హసిన్ జహాన్‌తో ఉంటోంది.(Mohammad Shami/Instagram)