Tokyo Olympics:టోక్యో చేరుకున్న భారత అథ్లెట్లు.. ఘనంగా వీడ్కోలు పలికిన మంత్రి.. ఫొటోలు
Tokyo Olympics:టోక్యో చేరుకున్న భారత అథ్లెట్లు.. ఘనంగా వీడ్కోలు పలికిన మంత్రి.. ఫొటోలు
88 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం శనివారం రాత్రి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి టోక్యో వెళ్లారు. వీరికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు.
టోక్యో ఒలింపిక్స్ 2020 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇండియా నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్న అథ్లెట్లలో కొంత మంది శనివారం ఢిల్లీ నుంచి టోక్యో బయలుదేరి వెళ్లారు. వీరికి అక్కడ ఘన స్వాగతం లభించింది. (SAI)
2/ 14
భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి టోక్యో వెళ్లడానికి ముందు ఢిల్లీ విమానాశ్రయంలో..(SAI)
3/ 14
భారత ఆర్చరీ బృందం (SAI)
4/ 14
ఢిల్లీలోని ఇందరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో స్టార్ షట్లర్ పీవీ సింధు (SAI)
5/ 14
అథ్లెట్ల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐవోయే చీఫ్ నరీందర్ బాత్రా.(SAI)
6/ 14
వీడ్కోలు కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి నితీశ్ ప్రామాణిక్, సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్ కూడా పాల్గొన్నారు. (SAI)
7/ 14
మన దేశం గర్వించేలా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని.. విజయాలతో తిరిగి రావాలని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆకాంక్షించారు. (SAI)
8/ 14
భారత హకీ జట్టు శనివారం వెళ్లిన వారిలో ఉన్నారు. (Hockey India)
9/ 14
శనివారం ప్రత్యేక విమానంలో వెళ్లిన 88 మంది అథ్లెట్లలో ఆర్చరీ, టేటుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, జూడో, హాకీ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ క్రీడాకారులు ఉన్నారు. (Hockey India)
10/ 14
88 మంది అథ్లెట్లు శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో జపాన్ వెళ్లారు. (Hockey India)
11/ 14
భారత మహిళా హాకీ జట్టు (Hockey India)
12/ 14
భారత షట్లర్లు బి. సాయి ప్రణీత్, సాత్వీక్ సాయిరాజ్ (SAI)
13/ 14
జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, భారత టేబుల్ టెన్నిస్ బృందం. (SAI)