INDIAN BOXERS TRAINING IN ITALY WHO WILL WIN MEDAL IN TOKYO OLYMPICS JNK
Tokyo Olympics : ఇటలీలో శిక్షణ పొందుతున్న భారత బాక్సర్లు.. ఒలింపిక్ పతకం గెలిచేదెవరు?
టోక్యోలో జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కోసం భారత బాక్సర్లు ఇటలీలో శిక్షణ పొందుతున్నారు. దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.
ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్ ఈ సారి ఒలింపిక్ పతకం సాధించాలని ఆశలు పెట్టుకున్నది. 38 ఏళ్ల మేరీ కామ్ ఇటలీలో విశ్వక్రీడలకు సిద్దపడుతున్నది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్ 52 కేజీల విభాగంలో పోటీ పడనున్నది. (PC-SAI)
2/ 7
భారత స్టార్ మేల్ బాక్సర్ ఒలింపిక్ పతకం సాధించాలని కలలు కంటున్నాడు. ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన పంగల్.. అనేక అంతర్జాతీయ పతకాలు కొల్లగొట్టాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 52 కేజీల విభాగంలో పోటీ పడుతున్నాడు. (PC-SAI)
3/ 7
హర్యానాకు చెందిన వికాస్ కృష్ణ మూడో సారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన వికాస్.. 69 కేజీల విభాగంలో పాల్గొంటున్నాడు. (PC-SAI)
4/ 7
91 కిలోల విభాగంలో సతీశ్ కుమార్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పలకాలు సాధించాడు. 5 సార్లు జాతీయ చాంపియన్ అయిన సతీష్.. తొలి సారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. (PC-SAI)
5/ 7
బాక్సర్ పూజారాణి కూడా ఇటలీలో శిక్షణ పిందుతున్నది. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన పూజారాణి.. ఆసియా క్వాలిఫయర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్నిపాను ఓడించి టోక్యోలో 75 కేజీల విభాగంలో తలపడనున్నది. (PC-SAI)
6/ 7
మేరీ కోమ్ పైనే అందరి ఆశలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఐఏబీఏ వుమెన్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ స్వర్ణ పతకం సాధించింది. ప్రస్తుతం ఇటలీలు కఠిన శిక్షణ తీసుకుంటున్నది. (PC-SAI)
7/ 7
మహిళా బాక్సర్ లోవ్లీనా 69 కేజీల విభాగంలో పోటీ పడుతున్నది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె రెండుసార్లు కాంస్య పతకాన్ని సాధించింది. (PC-SAI