ENGvIND : ఓపెనర్లు దుమ్మురేపినా.. కూలిన టీమ్ ఇండియా మిడిలార్డర్.. షెఫాలీ వర్మ అద్భుత ఇన్నింగ్స్

బ్రిస్టల్ కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ రెండో రోజు ఇంగ్లాండ్ మహిళలు పట్టు భిగించారు. తొలి ఇన్నింగ్స్‌లో 396/9 స్కోర్ వద్ద ఇంగ్లాండ్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఓపెనర్లు దుమ్ముదులిపారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు స్వల్ప వ్యవధిలో ఐదు వికెట్లు తీసి ఇండియాను కష్టాల్లోనెట్టారు.