రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలోనీ టీమిండియా (Team India) అదరగొడుతోంది. సొంత గడ్డపై విండీస్ జట్టుకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 3-0 తో వైట్ వాష్ చేసిన భారత్.. ధనాధన్ సిరీస్ ను కూడా ఘనంగా ప్రారంభించింది. ఇప్పుడు టీ-20 సిరీస్ పై కన్నేసింది రోహిత్ సేన. శుక్రవారం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టీ-20 మ్యాచ్ జరగనుంది. (AFP)
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ కీరోడ్ పొలార్డ్ కూడా సెంచరీ సాధించనున్నాడు. ఈ మ్యాచ్‌తో 100 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు బిగ్ పొలార్డ్. దీంతో, ఈ ఘనత సాధించిన తొలి వెస్టిండీస్ ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. పొలార్డ్ 99 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 1561 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. అలాగే, 99 సిక్సర్లు కూడా కొట్టాడు. అంటే 100వ టీ20 మ్యాచులో 100వ సిక్సర్ రికార్డుపై కూడా కన్నేశాడు. (AFP)
కీరన్ పొలార్డ్ బౌలింగ్ లో 42 వికెట్లు కూడా పడగొట్టాడు. 25 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. అతని మొత్తం T20 రికార్డును పరిశీలిస్తే, 513 ఇన్నింగ్స్‌లలో 32 సగటుతో 11,419 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు 56 అర్ధ సెంచరీలు చేశాడు. ఇది కాకుండా, అతను 368 ఇన్నింగ్స్‌లలో 25 సగటుతో 304 వికెట్లు కూడా తీసుకున్నాడు. 15 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం అతని బెస్ట్ ప్రదర్శన. (AFP)
ఇక, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. అతను 112 ఇన్నింగ్స్‌లలో 33 సగటుతో 3237 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. . విరాట్ కోహ్లీ 3244 పరుగులతో రెండో స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ 3299 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 63 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేయనున్నాడు. (AP)
T20 మరియు ODIలకు రెగ్యులర్ కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ వరుసగా మూడో సిరీస్‌పై కన్నేశాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా ఓడించింది. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సై అంటోంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా 36 మ్యాచ్‌లకు గాను 30 గెలిచాడు. (AP)