మరో రెండు రోజుల్లో భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంక వెళ్లిన యువ భారత జట్టు కూర్పుపై ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా బరిలోకి దిగేది ఎవరో తెలిసింది. కెప్టెన్, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు యువ ఆటగాడు పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత జట్టులోకి మొదటిసారి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌లకు నిరాశే ఎదురైంది. ఇక, తుది జట్టులోకి చోటు దక్కించుకునే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ పై ఓ లుక్కేద్దాం. (Photo Credit : BCCI)
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టు లంకకు వెళ్లింది. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటిన యువ ఆటగాళ్లు లంక పర్యటనలో ఉన్నారు. గబ్బర్ కెప్టెన్సీలో సత్తా చాటడానికి యంగ్ గన్స్ ఉవ్విల్లూరుతున్నారు. ఇక, వన్డేలో 45 పైగా యావరేజ్ ఉన్న శిఖర్.. టీమిండియా బ్యాటింగ్ లో కీలకం కానున్నాడు. ఈ సిరీస్ లో రాణిస్తే.. ఈ ఏడాది జరిగే టీ-20 వరల్డ్ కప్ కు రోహిత్ తో పాటు ఓపెనింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకుంటాడు గబ్బర్. (Photo Credit : BCCI)
ఇక, ప్రస్తుత జట్టులో ఇప్పుడు ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. శిఖర్ ధావన్ తర్వాత పృథ్వీ షాకే ఓపెనర్‌గా అంతర్జాతీయ అనుభవం ఉంది. పైగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పడిక్కల్, చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున రుతురాజ్ ఓపెనర్లుగా అదరగొట్టారు. నితీశ్ ఓపెనింగే కాకుండా వన్‌డౌన్‌లో ఆడగలడు. అయితే అతడికి అవకాశం రాకపోవచ్చు.
గత కొన్ని సిరీస్ ల్లో చాహల్ వికెట్లు తీస్తున్నా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో ఈ సిరీస్ లో చాహల్ బౌలింగ్ ఎలా వేస్తాడన్నది దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సిరీస్ లో చాహల్ అంతగా ఆకట్టుకోలేకపోతే.. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను మళ్లీ తిరిగి లిమిటెట్ క్రికెట్ లో చూసే అవకాశం ఉంది.