INDIA VS SOUTH AFRICA VIRAT KOHLI LED TEAM INDIAS FIRST PRACTICE SESSION AHEAD OF BOXING DAY TEST IN CENTURION PICS GOES VIRAL SRD
India Vs South Africa : ఆ చెత్త రికార్డును చెరిపేయడానికి గట్టిగా కష్టపడుతున్న టీమిండియా.. ఈ సారైనా..?
India Vs South Africa : ఈ సిరీస్‌లో కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేరు. యంగ్ కుర్రాళ్లకు ఇదో గోల్డెన్ ఛాన్స్.
టీమిండియా (Team India) డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో (South Africa Vs India) తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్ టీమిండియాకే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) కూడా చాలా కీలకం. భారత జట్టు ఇప్పటి వరకు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా.
2/ 12
కెప్టెన్సీ వివాదాన్ని (Captaincy Rift) మర్చిపోయి కోహ్లీ.. ఆఫ్రికాలో భారత జట్టు చరిత్రను మార్చాలనుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేరు.
3/ 12
కీలకమైన ఆటగాళ్లు టెస్టు జట్టుకు దూరమైనా దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా ఇండియాకు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గత 29 ఏళ్లగా ఏ భారత జట్టు కెప్టెన్‌కు సాధ్యం కాని ఫీట్‌ను విరాట్ కోహ్లీ చేసి చూపెట్టాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
4/ 12
ఇక, ఎన్నో విపత్కర పరిస్థితుల మధ్య సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తమ సన్నాహకాలను షురూ చేసింది.
5/ 12
ఒక్క రోజు క్వారంటైన్‌ను ముగించుకొని జోహన్నస్ బర్గ్‌లో ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది కోహ్లీసేన.
6/ 12
ఫస్ట్ ట్రైనింగ్ సెషన్ లో టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్ లో చెమటోడ్చారు.
7/ 12
టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రహానే, కేఎల్ రాహుల్, పుజారా, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.
8/ 12
బ్యాటింగ్ కోచ్ విక్రమ రాథోడ్ తో పాటు టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ కూడా ఈ ట్రైనింగ్ సెషన్ ను పర్యవేక్షించాడు. ఆటగాళ్లకు విలువైన సలహాలిచ్చారు.
9/ 12
ఇక, బౌలర్లు ఉమేష్ యాదవ్, సిరాజ్, అశ్విన్ కూడా నెట్స్ లో బ్యాటర్లకు బంతుల్ని సంధించారు.
10/ 12
ఇక, అంతకుముందు టీమిండియా ఆటగాళ్లంతా జాలీగా జాలీగా ఫుట్ వాలీ మ్యాచ్ ఆడారు. ఈ సెషన్‌ను టీమిండియా స్ట్రెంత్ కండిషన్ కోచ్ సోహమ్ దేశాయ్ పర్యవేక్షించాడు.
11/ 12
విశ్రాంతి తర్వాత జట్టులో చేరిన జస్ప్రీత్ బుమ్రా కూడా నెట్స్ లో చురుగ్గా పాల్గొన్నాడు. తన సహచరులతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
12/ 12
తన అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ బాదిన శ్రేయస్ అయ్యర్ కి సౌతాఫ్రికా పర్యటన ఎంతో కీలకం కానుంది.