అయితే.. లక్నో జట్టు ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ (RCB) చేతిలో ఓడిపోయి టోర్ని నుంచి నిష్క్రమించింది. దీంతో.. మరో సారి రాహుల్ సారథ్యంలోని జట్టు కప్పు అందుకోకుండానే ఖాళీ చేతులతో ఇంటి దారి పట్టింది. దీంతో.. కేఎల్ రాహుల్ ఐపీఎల్ కప్పు కల నెరవెరలేదు. గతంలో రాహుల్ కెప్టెన్సీ వహించిన పంజాబ్ జట్టులో సరియైన ప్లేయర్లు లేక బోల్తా పడింది అనుకోవచ్చు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో ఆ స్థాయి బ్యాటర్‌గా, మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం టీమిండియాకుప్రాతినిధ్యం వహించి, గొప్ప ఆటగాళ్ల జాబితాలో చేరగల సామర్థ్యం ఉన్నవాడిగా పేరుంది కేఎల్ రాహుల్‌కు. అయితే ప్రతిభ విషయంలో ఏ లోటూ లేకపోయినా.. ఇంకా రాహుల్ పూర్తి స్థాయి మ్యాచ్ విన్నర్‌గా మారలేదన్నది విశ్లేషకుల మాట. ఇటు ఐపీఎల్లో, అటు అంతర్జాతీయ క్రికెట్లో అతను కెప్టెన్‌గా లభించిన అవకాశాలను కూడా ఉపయోగించుకోలేకపోయాడు.
భవిష్యత్తు టీమిండియా సారథిగా తనేంటో రుజువు చేసుకోవడానికి దక్షిణాఫ్రికా సిరీస్ కేఎల్ రాహుల్ కి ఓ గోల్డెన్ ఛాన్స్. రోహిత్ శర్మ గైర్హాజరీతో ఈ సిరీస్‌లో భారత జట్టుకు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఒకవేళ ఈ సిరీస్‌లో రాహుల్ కెప్టెన్‌గా నిరాశపరిస్తే.. భవిష్యత్తులో టీమిండియాకు ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా అవకాశం లభించడం కష్టమే అని చెప్పొచ్చు.
ఇప్పుడు అదే ప్రత్యర్థితో సొంతగడ్డపై సిరీస్‌లో రాహుల్‌కు మరో అవకాశం కల్పించారు సెలక్టర్లు. రోహిత్ మీద కెప్టెన్సీ భారాన్ని తగ్గించడానికి త్వరలోనే టెస్టుల వరకైనా వేరే కెప్టెన్‌ను చూడాల్సిందే. రోహిత్‌కు వయసు కూడా మీద పడుతోంది కాబట్టి టీ20 ప్రపంచకప్ అయ్యాక ఆ ఫార్మాట్లోనూ కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవచ్చు.
ఇప్పటికే టీ20 లీగ్‌లో కెప్టెన్లుగా రుజువు చేసుకున్న హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లతో అతడికి పోటీ తప్పదు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సడన్ గా ఐపీఎల్ 2022 టైటిల్ తో ఈ రేసులో అందరికన్నా ముందుకు వచ్చాడు. హార్దిక్ కెప్టెన్సీ అచ్చం ధోనిని పోలి ఉండటంతో మాజీ క్రికెటర్లు చాలా మంది హార్దిక్ కే ఓటు వేస్తున్నారు. దీంతో.. ప్రాణ స్నేహితుడైనా హార్దిక్ తోనే కేఎల్ రాహుల్ తీవ్ర పోటీ ఎదుర్కొవాల్సి ఉంది.
కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవడానికి కేఎల్ రాహుల్‌కు ఇంతకన్నా మంచి అవకాశం ఇంకొకటి దక్కే ఛాన్సే లేదు. సీనియర్ ప్లేయర్స్ కోహ్లి, రోహిత్, షమి, బుమ్రా లాంటి సీనియర్లు దూరమై, ఎక్కువగా కుర్రాళ్లతో నిండిన జట్టును రాహుల్ ఎలా నడిపిస్తాడు.. బ్యాట్స్‌మన్‌గా ఎలా రాణిస్తాడు, నాయకత్వ లక్షణాలను ఎంత మేర ప్రదర్శిస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.