ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) తర్వాత జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఢిల్లీలో జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. టీ20ల్లో వరుసగా 13వ విజయం సాధించినట్లవుతుంది. ఇది ప్రపంచ రికార్డు కూడా అవుతుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ పని చేయలేకపోయింది. (AFP)
అయితే, టీమిండియా విజయాల్ని అడ్డుకోవడానికి దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఐదుగురు ఆటగాళ్లు సై అంటున్నారు. ఈ ఐదుగురిలో అతి పెద్ద పేరు క్వింటన్ డి కాక్. ఈ పాకెట్ డైనమైట్ IPL 2022లో KL రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌లో భాగంగా ఉన్నాడు. అంతేకాకుండా ఒక సెంచరీ సహాయంతో ఈ సీజన్ లో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ పై అతనికి సూపర్ రికార్డు ఉంది. భారత్‌తో 3 మ్యాచ్‌ల్లో 69 సగటుతో 137 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయ్. (PTI)
డేవిడ్ మిల్లర్ కూడా తక్కువోడేమీ కాదు. ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ విజయాల్లో మిల్లర్ కూడా కీ రోల్ ప్లే చేశాడు. మిడిలార్డర్లో ఆడుతూ చాలా మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సీజన్ లో 480కి పైగా పరుగులు కూడా చేశాడు. భారత్‌పై 9 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్.. 7 ఇన్నింగ్స్‌ల్లో 99 పరుగులు చేశాడు. (PTI)
ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తరఫున ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా ఆడిన సంగతి తెలిసిందే. అతను 13 మ్యాచ్‌ల్లో 18 సగటుతో 23 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్ కూడా ఆ జట్టులో 15 వికెట్లు తీయలేకపోయాడు. భారత్‌పై 4 టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో పాటు తన భీకరమైన పేస్ తో టీమిండియా బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టే అవకాశం ఉంది. (Instagram)
ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే గంటకు 150 కి.మీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తాడు. అయితే, ఐపీఎల్ 2022 సీజన్ లో అంతగా రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 6 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. భారత్‌తో ఒక టీ20 ఆడిన నోర్ట్జే ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ, ఒకసారి లయ అందుకుంటే నోర్ట్జే బౌలింగ్ ఆడటం కష్టమే. (Instagram)