భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ (IND vs SA ODI Series) జనవరి 19 నుంచి బోలాండ్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా అతడు వన్డే సిరీస్ కూడా దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ కు ఇది అగ్ని పరీక్ష లాంటిది. ఈ సిరీస్ కోసం భారత్ సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ తొలి టీమ్ మీటింగ్‌కు హాజరయ్యాడు. (PC : BCCI)
పలువురు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ని టెస్ట్ కెప్టెన్ గా ఎంపిక చేయాలని చూస్తున్నారు. గత రెండేళ్లుగా ఓ ఆటగాడిగా తనేంటో నిరూపించుకున్న కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు అంతగా బాగా లేదు. ఐపీఎల్ లో కింగ్స్ కు నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్ ఆ టీమ్ ను విజేతగా నిలపలేకపోయాడు. విరాట్ గైర్హాజరీలో జోహన్నెస్‌బర్గ్ టెస్టులో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఈ టెస్టులో భారత్ ఓడిపోయింది. తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకునే గొప్ప అవకాశం కేఎల్ రాహుల్‌కు లభించనుంది. (PC : BCCI)
కేఎల్ రాహుల్‌కు ప్లస్ పాయింట్.. కోహ్లీ రూపంలో మంచి అనుభవమున్న ఆటగాడు జట్టులో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే కేఎల్ రాహుల్ తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid),కేఎల్ రాహుల్ జట్టులోని మిగతా ఆటగాళ్లతో మ్యాచ్ ప్లానింగ్‌ను వివరిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఒక ఫొటోలో కోచ్, కెప్టెన్ సలహాలను శ్రద్ధగా వింటూ కనిపించాడు.(PC : BCCI)
రోహిత్ శర్మకు 34 ఏళ్లు. 2023 ప్రపంచకప్ తర్వాత అతను వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉండలేడు. ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్‌ను జట్టుకు కెప్టెన్‌గా నియమించవచ్చు. పంత్ తన కెప్టెన్సీలో గత ఐపీఎల్లో క్యాపిటల్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. సునీల్ గవాస్కర్ కూడా అతనిని టెస్ట్ కెప్టెన్‌గా చేయడం ఉత్తమం అని అభిప్రాయపడుతున్నాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు కూడా అంత బాగా లేదు. కెప్టెన్‌గా ఐపీఎల్లో 27 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 11 మాత్రమే నెగ్గాడు. దీంతో అతని కెప్టెన్సీకి ఇది కచ్చితంగా అగ్నీ పరీక్ష. (PC : BCCI)
ఈ టీమ్ మీటింగ్‌లో రాహుల్ ద్రవిడ్ కూడా ఆటగాళ్లతో చాలా సేపు మాట్లాడాడు. ప్రధాన కోచ్‌గా ఇది అతని మొదటి విదేశీ పర్యటన. టెస్టు సిరీస్‌లో ద్రావిడ్ వ్యూహానికి ఫలితం జట్టుకు అనుకూలంగా రాకపోవడంతో 29 ఏళ్ల తర్వాత సిరీస్ గెలవాలన్న కల నెరవేరలేదు. అయితే వన్డే సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా పర్యటనను విజయంతో ముగించాలని ద్రవిడ్ భావిస్తున్నాడు. (PC : BCCI)