అయితే, బోలాండ్ పార్క్ వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్ (Ind Vs Sa First Odi)లో సౌతాఫ్రికా టీమిండియా (Team India) ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటింగ్ లో వాన్ డర్ డస్సెస్, కెప్టెన్ బవుమా సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో మెరిశారు. వాన్ డర్ డస్సెన్ ( 96 బంతుల్లో 129 పరుగులు 9 ఫోర్లు, 4 సిక్సర్లు), బవుమా (143 బంతుల్లో 110 పరుగులు, 8 ఫోర్లు ) అదరగొట్టారు.
ఓ దశలో 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను వీరిద్దరి భాగస్వామ్యం పటిష్ట స్థితిలో నిలిపింది. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 204 పరుగుల భారీ పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చాహల్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ నిరాశపర్చారు.
మరోవైపు, కేఎల్ రాహుల్ కు ఈ సిరీస్ అగ్ని పరీక్ష లాంటిది. భవిష్యత్తు నాయకుడిగా కేఎల్ రాహుల్ పేరు వినబడుతోంది. అయితే, రాహుల్ కి కెప్టెన్సీ రికార్డు అంతగా బాగాలేదు. ఐపీఎల్ కింగ్స్ కు నాయకత్వం వహించిన రాహుల్ కి చెత్త రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో.. కెప్టెన్ గా రాహుల్ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది.