India Vs Pakistan: దాయాదీల పోరులో గెలిచేదెవరో? గత రికార్డులు ఇవే.. భారత్‌ను ఊరిస్తున్న మరో రికార్డు

India vs Pakistan: టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ జట్లు లీగ్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. గతంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లలో ఇరు జట్లు 5 సార్లు తలపడగా.. అన్నింటా భారత జట్టే విజయం సాధించింది. చివరి సారిగా ఈ రెండు జట్లు 2016లో కోల్‌కతాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడగా భారత జట్టు విజయం సాధించింది. అదే రికార్డును భారత జట్టు కొనసాగించాలని భావిస్తున్నది.