టి20 ప్రపంచకప్ తర్వాత టీ-20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఈ ఫార్మాట్లో కెప్టెన్గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ (KL Rahul) వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
ఓవరాల్గా కోహ్లి టి20ల్లో 49 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా.. టీమిండియా 31 మ్యాచ్లు గెలిచి 16 ఓడిపోయింది. 63.27 శాతంతో కెప్టెన్గా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లికి ఎందుకో ఐసీసీ ఫార్మాట్లో మాత్రం దురదృష్టమే ఎదురవుతూ వస్తోంది. ఇక వన్డే, టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించనున్న కోహ్లి 2023 వన్డే వరల్డ్కప్ అయినా సాధిస్తాడా అనేది ప్రశార్నర్థకమే.