IND vs NZ: తొలి టెస్టుకు ముందు అశ్విన్‌ను ఊరిస్తున్న 3 రికార్డులు.. ఆ దిగ్గజాలను అధిగమించే అవకాశం

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. మూడో టీ20లో అతనికి విశ్రాంతిని ఇచ్చారు. టీ20 సిరీస్ తర్వాత అశ్విన్ ఇప్పుడు టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాడు. టెస్టు సిరీస్‌లో కేన్ విలియమ్సన్‌ను అశ్విన్ మరోసారి ఔట్ చేస్తే.. కివీస్ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇండియన్ బౌలర్లలో అగ్రస్థానానికి చేరుకుంటాడు.