కోల్‌కతా వేదికగా జరిగిన మూడో, చివరి టీ20లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అయ్యర్‌కు బౌలింగ్ చేసే అవకాశం రోహిత్ ఇవ్వలేదు. అయితే, గత మ్యాచ్‌లో అయ్యర్‌కు అవకాశం రావడమే కాదు.. తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను తీయగలిగాడు.
వెంకటేష్ అయ్యర్ ప్రదర్శన రోహిత్ శర్మను కూడా బాగా ఆకట్టుకున్నది. మూడో టీ20 తర్వాత వెంకటేశ్ అయ్యర్‌కు తన మద్దతు ఉంటుందని రోహిత్ చెప్పాడు. భారత కెప్టెన్ ఇలా అన్నాడు, "మీరు అతని బౌలింగ్ టాలెంట్ చూశారు. ఇది కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే. కాబట్టి పూర్తి స్థాయిలో అతడి టాలెంట్ చూపించలేక పోయాడు. కానీ మేము అతనికి మరిన్ని చాన్స్‌లు ఇస్తాము' అని అన్నాడు.