Home » photogallery » sports »

INDIA VS NEW ZEALAND GLAD WE LEARNED FROM MISTAKES IN FIRST T20I SAY CAPTAIN ROHIT SHARMA CR

Ind vs NZ: రో‘హిట్ మ్యాన్’ ఈజ్ బ్యాక్... రెండో టీ20 మ్యాచ్ హైలెట్స్ ఇవే...

మొదటి టీ20 మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన భారత జట్టు... రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. మొదట బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేసి... ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తే... తర్వాత కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని తేలిగ్గా చేధించారు బ్యాట్స్‌మెన్. మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించిన భారత బౌలర్లు... రెండో మ్యాచ్‌లో పూర్తిగా మారిపోయారు. ముఖ్యంగా ప్రారంభ ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా... కివీస్‌ను కట్టడి చేశాడు. మూడు మ్యాచుల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... రికార్డు హాఫ్ సెంచరీతో చెలరేగాడు.