IND vs NZ Test: టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు టెస్టు సిరీస్‌లో కూడా విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నది. నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గైర్హాజరీలో అజింక్యా రహానే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్కి ఇదే తొలి టెస్టు సిరీస్. కాబట్టి అతను గెలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదిలివేయడానికి ఇష్టపడడు. కాన్పూర్‌లో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో ఇది కనిపించింది. అతను జట్టులోని ప్రతి ఆటగాడితో మాట్లాడుతూ కనిపించాడు. (PC- BCCI Twitter)
కాన్పూర్ టెస్టుకు ముందు అజింక్య రహానే జట్టు ప్రాక్టీస్ సెషన్లో కూడా చెమటలు పట్టేలా బ్యాటింగ్ చేశాడు. తొలి టెస్టులో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక డిసెంబర్ 3 నుంచి ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు. కోహ్లి కూడా ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2019 నుంచి 40 టెస్టులు ఆడిన రహానే 7 అర్ధసెంచరీలు, 3 సెంచరీలు చేశాడు. (PC-BCCI Twitter)
టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్కి ఇదే తొలి టెస్టు సిరీస్. టీ20 లాగే టెస్టుల్లోనూ అతడి టార్గెట్ క్లీన్స్వీప్పైనే ఉంటుంది. అందుకే ప్రాక్టీస్ సెషన్లో ప్రతి ప్లేయర్‌తో మాట్లాడుతూ కనిపించాడు. ముఖ్యంగా యువ క్రికెటర్లతో మ్యాచ్ గురించి సూచనలు చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపాడు. (PC-BCCI TWITTER)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సీజన్లో భారత్ శుభారంభం చేసింది. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఏడాది జరగనున్న ఈ సిరీస్‌లోని ఐదో టెస్టు కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సిరీస్ కూడా గెలిస్తే భారత జట్టు మరింత ముందంజలో ఉంటుంది. (AFP)
కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్‌ను ఓడించింది. అయితే భారత్‌లో టెస్టులు గెలవడం అతనికి అంత సులభం కాదు. న్యూజిలాండ్ జట్టు భారత్‌లో ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. అంతకుముందు 2016-17లో న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.(AFP)