గత నెలలో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో సమిష్టిగా అందరూ చేతులేత్తయడంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ఇక, వచ్చే నెల 4 నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడనుంది కోహ్లీసేన. ఆగష్టు 4 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీని కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.