డిసెంబరు 4న ప్రారంభమయ్యే వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు (Team India) ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. 'మెన్ ఇన్ బ్లూ' ఉపఖండపు పిచుల్లో చెలరేగడానికి సై అంటుంది. దాదాపు మూడేళ్ల తర్వాత తన ఫామ్‌ను తిరిగి అందుకున్న ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లి (Virat Kohli)పై మరోసారి అందరి దృష్టి నెలకొంది. అయితే, ఈ పర్యటనలో కొన్ని అరుదైన రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. (PIC:AP)
విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్లు పాటు ఫామ్ కోసం నానా తంటాలు పడ్డాయి. అయితే, ఆసియా కప్ లో తిరిగి లయ అందుకున్న కోహ్లీ అక్కట్నుంచి తగ్గేదే లే అన్నట్టు ఆడుతున్నాడు. . ఆఫ్ఘనిస్తాన్పై ఒక సెంచరీతో సహా ఐదు ఇన్నింగ్స్‌లలో 276 పరుగులతో ఆసియా కప్ 2022లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీ అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ 71వది. (PIC:AP)
విరాట్ కోహ్లి బంగ్లాదేశ్ పర్యటనలో మరో సెంచరీ సాధిస్తే.. లెజండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ 71 అంతర్జాతీయ సెంచరీల రికార్డును అధిగమిస్తాడు రన్ మెషీన్. , అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో నిలుస్తాడు. 100 అంతర్జాతీయ సెంచరీలతో కోహ్లీ కంటే సచిన్ టెండూల్కర్ మాత్రమే ముందున్నాడు. (PIC: AFP)
గతంలో రోహిత్ ఇంగ్లండ్ గడ్డపై 18 మ్యాచుల్లో వెయ్యి పరుగులు చేశాడు. ధావన్ కూడా ఇంగ్లండ్ గడ్డపైనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే.. ధావన్ వెయ్యి పరుగులు మార్క్ ను 19 వన్డేల్లో అందుకున్నాడు. ఇక, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో ఒక దాంట్లోనైనా కోహ్లీ సెంచరీ కొడితే.. పాంటింగ్ రికార్డు బద్దలు అవ్వడం ఖాయం. (PIC:AP)