బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా( Team India) తొలి ఇన్నింగ్స్‌లో 86.3 ఓవర్లలో 314 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇక, తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 80 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, కష్టాల్లో ఉన్న టీమిండియాను పంత్ (Rishabh Pant), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆదుకున్న సంగతి తెలిసిందే.
అయితే, పంత్ 49 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దీంతో, టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై ధోని తర్వాత అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే, 2007లొ ఇదే వేదికపై ధోని 50 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. అదే విధంగా ధోని, వృద్ధిమాన్ సాహా తర్వాత బంగ్లాపై యాభై పైచిలుకు పరుగులు చేసిన మూడో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.
ఇక, టెస్టుల్లో 7 వేల పరుగులు అందుకున్న ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఛతేశ్వర్ పుజారా.డాన్ బ్రాడ్‌మన్ 6997 పరుగులను అధిగమించిన ఛతేశ్వర్ పూజారా.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ తర్వాత టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు.