భరత్ పూర్తి పేరు కేఎస్ శ్రీకర్ భరత్. అతన 1993లో అక్టోబరు3న కోనసిమ జిల్లా రామచంద్రపురంలో జన్మించాడు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. 2015 ఫిబ్రవరిలో రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు. అదే నెలలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ డేర్‌డెవిల్స్ అతన్ని 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. Image source Twitter/Manojkumar_099
అయితే..స్పెషలిస్ట్ వికెట్ కీపింగ్ బ్యాటర్ అయిన భరత్‌వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. వైట్ బాల్ క్రికెట్లో.. అది కూడా కేవలం వన్డేల్లోనే సత్తా చాటుకొన్న ఇషాన్ కిషన్‌కు రెడ్ బాల్ క్రికెట్లో రికార్డులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో భరత్‌కు తుది టీమ్‌లో స్థానం దక్కింది. Image source Twitter/mysondaniel86is
స్వదేశంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సహచరుల అభినందనలతో టీమిండియా క్యాప్ అందుకుని ఉద్వేగానికి గురయ్యాడు. రంజీల్లో నిలకడగా రాణించిన భరత్ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శన కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఇటు అభిమానులు కూడా భరత్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. Image source Twitter/Circle of Cricket