అలెక్స్ క్యారీని ఔట్ చేసిన అశ్విన్.. ఈ ఘనత సాధించాడు. కుంబ్లే 93 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించగా.. అశ్విన్‌కు మాత్రం 89టెస్టు మ్యాచ్‌లే పట్టింది. 2005లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే తన 450వ వికెట్‌ను పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. Image source Twitter/WisdenIndia
మొదటి 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్, 11వ ఓవర్లో తొలి వికెట్ అందించాడు. 33 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసిన అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ వికెట్‌తో తన టెస్టు కెరీర్లో 450 వికెట్లు పూర్తి చేసుకున్నాడు అశ్విన్. Image source Twitter/TalmaleAnshul
ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), అనిల్ కుంబ్లే(భారత్), మెక్ గ్రాత్, షేన్ వార్న్, లయన్(ఆస్ట్రేలియా), ఆండర్సన్(ఇంగ్లండ్), వాల్ష్(వెస్టిండీస్), బ్రాడ్(ఇంగ్లండ్), అశ్విన్(భారత్) ఈ ఘనత సాధించారు. Image source Twitter/SunRisers
టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ (708), ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (675), భారత దిగ్గజం అనిల్ కుంబ్లే (619), ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (566) టాప్-5లో ఉన్నారు. Image source Twitter/StarSportsTamil