ఈ నిబంధనల కారణంగా డిసెంబర్ చివరికి గానీ రోహిత్ శర్మ జట్టుతో చేరలేడు. డిసెంబరు 17 నుంచి 21 వరకూ మొదటి టెస్టు జరగనుండగా.. ఆ తర్వాత డిసెంబరు 26 నుంచి 30 వరకూ రెండో టెస్టు జరగనుంది. క్వారంటైన్ నిబంధనలను సడలించకపోతే.. ఈ రెండు మ్యాచ్‌లకీ హిట్‌మ్యాన్ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మయాంక్ అగర్వాల్ టెస్టు ఓపెనర్‌గా ఖాయమవగా.. అతనికి జోడీగా శుభమన్ గిల్ లేదా పృథ్వీ షా తొలి రెండు టెస్టుల్లో భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించే అవకాశం ఉంది.