వరుసగా విఫలమవుతూ వస్తున్న కెఎల్ రాహుల్, మురళీ విజయ్ ‘బాక్సింగ్ డే’ టెస్ట్ మ్యాచ్‌లో జట్టులో స్థానం కోల్పోయారు.
నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు కెఎల్ రాహుల్. ఇందులో పెర్త్ టెస్ట్‌లో చేసిన 44 పరుగులే అత్యధికం.
మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 49 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్ టెస్ట్‌లో చేసిన 20 పరుగులే అతని అత్యధిక స్కోరు.
వీరి స్థానంలో తెలుగు కుర్రాడు హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌లకు తుది జట్టులో స్థానం కల్పించారు సెలక్టర్లు. వీరిలో రోహిత్ శర్మ జోడిగా మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
కొన్నాళ్లుగా గాయంతో బాధపడుతూ జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తుది జట్టులో స్థానం దక్కింది.
ఆసియాకప్ టోర్నీలో గాయపడి... జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు కూడా తుది జట్టులో స్థానం దక్కింది.
రెండు టెస్ట్‌లో కెప్టెన్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ... భారత ఓపెనర్లు విఫలమవ్వడంతో పాటు బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్ సహకారం లేకపోవడంతో ఘోరంగా ఓడింది భారత జట్టు.
మరో వైపు ఆసీస్ కూడా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. హ్యాండ్స్కొంబ్ స్థానంలో మిట్చ్ మార్ష్‌కు స్థానం దక్కింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 49.98 సగటుతో 3599 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్... ఓ త్రిబుల్ సెంచరీ కూడా సాధించాడు. అతని రాకతో ఓపెనింగ్ సమస్య తీరుతుందని భావిస్తోంది భారత జట్టు.
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌కు ఆసీస్ జట్టు కో-కెప్టెన్‌గా 7 ఏళ్ల ఆర్చీ షిలెర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.