ఇక.. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మరోసారి కంగారూ బ్యాట్స్మెన్లకు పరీక్ష పెట్టనున్నాడు. ఇప్పటి వరకు సిరీస్‌లో అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టాడు. అహ్మదాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. కానీ.. జడేజా లోకల్ భాయ్. దీంతో.. ఆస్ట్రేలియాకు చుక్కలు చూపగలడు. (AP)
ప్రస్తుత సిరీస్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. కానీ అతను 2 అర్ధ సెంచరీలు చేశాడు. అహ్మదాబాద్‌లో ఈ బౌలర్ ప్రదర్శన అద్భుతం. 2 టెస్టుల్లో 9 సగటుతో 20 వికెట్లు తీశాడు. 38 పరుగులకే 6 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. దీంతో.. ఆస్ట్రేలియాకు సవాల్ విసరనున్నాడు అక్షర్. (AP)
మూడో టెస్టులో ఛతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరితో ఫాంలోకి వచ్చాడు. అహ్మదాబాద్‌లో అతని ప్రదర్శన మరింత అద్భుతమైనది. అతను 3 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో 132 సగటుతో 264 పరుగులు చేశాడు. అజేయంగా 206 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఇక్కడ రాణించి ఆస్ట్రేలియాకు మరోసారి షాకివ్వాలనుకుంటున్నాడు పుజారా. (AP)