ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగుల ఆధిక్యం సంపాందించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (5), బుమ్రా (0)లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 53 పరుగులతో కలుపుకుంటే భారత ఆధిక్యం 62 పరుగులకు పెరిగింది. (IMAGE: TWITTER)
అంతకు ముందు అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. బ్యాట్స్ మెన్ విఫలమైన చోట రాణించి టీమిండియాకు ఆధిక్యం సంపాందించారు. తొలి డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) ఆసీస్ జట్టును బెంబేలెత్తించారు. (IMAGE: TWITTER)