రెండో టీ20లో స్మృతి మంధాన (Smriti Mandhana) 39 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. శ్రీలంక సెట్ చేసిన 126 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.1 ఓవర్లలోనే సాధించింది.
ఇక, 25 ఏళ్ల స్మృతి మంధాన టీ20 ఇంటర్నేషనల్‌లో ఓ అరుదైన ఘనతను అందుకుంది. పొట్టి క్రికెట్ లో రెండు వేల పరుగులు పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళా క్రీడాకారిణి. ఇంతకు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ మాత్రమే ఈ ఫీట్ అందుకున్నారు. హర్మన్‌ప్రీత్ 2372, మిథాలీ 2364 పరుగులు చేశారు. (AFP)