టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) 8 జూన్ 2022న అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్ తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ మిథాలీనే. భారత్ తరుపున ఎన్నో పెద్ద రికార్డుల్ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా భారత్ తరఫున ఆరు ప్రపంచకప్ లు కూడా ఆడింది. (AFP)
ప్రస్తుతం భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 31 పరుగుల నిలవడంతో రెండో టీ20లో కూడా టీమిండియా విజయం సాధించింది. (AFP)
తన అజేయ ఇన్నింగ్స్ తో హర్మన్ అతి పెద్ద రికార్డును సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. మిథాలీ రిటైర్మెంట్ తర్వాత 16 రోజులకే తన రికార్డును బద్దలు కొట్టింది. ఆమె ఇప్పటివరకు 123 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 2372 పరుగులు చేసింది. ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయ్. (Instagram)