క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పటికీ ఉన్నా. వచ్చే ఏడాది ఆరంభమయ్యే మహిళల ఐపీఎల్ కు మరి కొన్ని నెలల టైం ఉంది. నాకు అందులో ఆడాలని ఉంది. కానీ, అప్పటికి ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి.. కాస్త టైం తీసుకుని ఆ లోపు ఆడాల వద్దా అనేది నిర్ణయించుకుంటా. నా వరకు మాత్రం తొలి మహిళల ఐపీఎల్ ఎడిషన్ లో భాగం కావాలని ఉంది‘ అని మిథాలీ పేర్కొంది.