ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన ODI సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో (IND vs WI), అతను అర్ధ సెంచరీలు చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ముందంజలో ఉంది. మూడో మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ మ్యాచులో కూడా గెలిచి క్లీస్ స్వీప్ చేయాలని ఉవ్విల్లూరుతుంది టీమిండియా. (PTI)
బుధవారం జరిగే మూడో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ బాదితే.. వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌పై ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. అతను రోహిత్ శర్మ, అజింక్యా రహానె, మహ్మద్ కైఫ్‌లతో సరసన చేరుతాడు. విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ రికార్డు సాధించలేకపోయారు. (AFP)
27 ఏళ్ల ముంబై ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కి వన్డేల్లో మంచి రికార్డు ఉంది . 29 మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ 26 ఇన్నింగ్స్‌ల్లో 43 సగటుతో 1064 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 103 పరుగులు అత్యుత్తమ ఇన్నింగ్స్. భారత్ తరఫున 5 టెస్టుల్లో 422 పరుగులు, 42 టీ20ల్లో 931 పరుగులు చేశాడు. (Instagram)