[caption id="attachment_1269914" align="alignnone" width="1600"] భవిష్యత్తులో ఆటగాళ్ళు వన్డే ఫార్మాట్ కంటే టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకుని అందరనీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆడటం తనకు చాలా కష్టంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ తెలిపాడు.
‘వన్డేలు, టీ20లు కంటే టెస్టు క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. కానీ టెస్టు క్రికెట్ రోజు రోజుకి ఆదరణ కోల్పోతోంది. ఇక ఇప్పటికే ఆటగాళ్లు వారు ఏ ఫార్మాట్లలో ఆడాలో నిర్ణయించుకున్నారు. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే.. అతడు ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలను క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. అతడు ఇదే విషయాన్ని చాలా సార్లు స్పష్టంగా చెప్పాడు. దాంతో అతడు భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది‘ అని రవిశాస్త్రి తెలిపాడు.