శ్రీలంక (Sri lanka)తో జరిగిన టి20 సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత (Team India) జట్టు... మార్చి 4 గురువారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం సిద్ధమవుతోంది. మొహాలి వేదికగా జరిగే ఈ టెస్టు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ మ్యాచ్ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చాలా ప్రత్యేకమైనది.
లేటెస్ట్ గా ఫ్యామిలీతో కలిసి హాలిడే కోసం లండన్ వెళ్లిన గంగూలీ.. గురువారం చండీగఢ్ చేరుకోనున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలను షేర్ చేయడం ద్వారా తెలియజేశాడు. అదే సమయంలో, మీడియా కథనాల ప్రకారం, మొహాలీలో కోహ్లి 100వ టెస్టు మ్యాచ్లో గంగూలీ పాల్గొంటాడు. ఇది క్రికెట్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే న్యూస్.
టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని కోహ్లీని కోరినట్లు బీసీసీఐ ప్రెసిడెంట్ చెప్పగా, విలేకరుల సమావేశంలో కోహ్లీ ఆ మాటలు అబద్ధమని చెప్పేశాడు. కోహ్లీ ప్రకటనతో బీసీసీఐతో.. టీమిండియాకు మాజీ కెప్టెన్ కు చెడిందని వార్తలు హల్చల్ చేశాయ్. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ 100 వ టెస్టుకు గంగూలీ రావడంపై ఫోకస్ ఏర్పడింది.