రేపటి తో భారత్-శ్రీలంక (India vs Sri Lanka) మధ్య మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం (జూన్ 18) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు, పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంక వెళ్లిన యువ భారత జట్టు కూర్పుపై ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా బరిలోకి దిగేది ఎవరో తెలిసింది. కెప్టెన్, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో (Shikhar Dhawan) పాటు యువ ఆటగాడు పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో భారత జట్టులోకి మొదటిసారి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌లకు నిరాశే తప్పేలా లేదు. మూడు వన్డేలతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. టెస్టు సిరీస్ కోసం భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా.. పూర్తిగా యువకులతో కూడిన పరిమిత ఓవర్ల జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. యువ జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహిస్తుండగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
దీంతో 1984లో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించిన మొహిందర్ అమర్నాథ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. పాకిస్థాన్‌పై 34 సంవత్సరాల 37 రోజుల వయసులో అమర్నాథ్ తొలిసారిగా టీమిండియాకు నాయకత్వం వహించాడు. సయ్యద్ కిర్మానీ (33 సంవత్సరాల 353 రోజులు), అజిత్ వాడేకర్ (33 సంవత్సరాలు 103 రోజులు)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక, వన్డేల్లో భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. వన్డేలో 6000 పరుగులు పూర్తి చేయడానికి అతడికి మరో 23 పరుగులు అవసరం. తొలి వన్డేలో 23 పరుగులు చేస్తే.. 6000 వన్డే పరుగులు పూర్తి చేసిన 5వ భారత ఓపెనర్‌గా ధావన్ రికార్డు సృష్టిస్తాడు. ఇక 35 పరుగులు చేస్తే.. 10000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా నిలవనున్నాడు. 17 రన్స్ చేస్తే.. శ్రీలంకపై 1000 పరుగులు పూర్తిచేస్తాడు. ఇన్నింగ్స్ పరంగా వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.
వాస్తవానికి ఈ నెల 13 నుంచే సిరీస్ ప్రారంభంకావాల్సి ఉంది. కానీ శ్రీలంక బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్ ఇటీవల కరోనా వైరస్ బారినపడటంతో.. సిరీస్‌ని ఐదు రోజులు వాయిదా వేశారు. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఇక, ఈ సిరీస్ ద్వారా టీమిండియా జట్టులో సుస్థిర స్ధానం దక్కించుకోవాలని యంగ్ కుర్రాళ్లు భావిస్తున్నారు.