కోల్ కతా (Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా (Team India) విక్టరీ కొట్టింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే, ఓ ఆటగాడి ప్రవర్తనపై ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్. వాళ్ల కోపానికి చాలా కారణాలే ఉన్నాయి.
టీమిండియా టీ20 కెప్టెన్‌గా అనధికారికంగా బాధ్యతలు తీసుకున్న హార్దిక్ పాండ్యాపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ 2024 లక్ష్యంగా టీమ్‌ను సిద్దం చేయడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టంది. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లందర్నీ టీ20లకు దూరంగా ఉంచాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసి యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తోంది. టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పేరును అధికారికంగా ప్రకటించకపోయినా.. అతన్నే కొనసాగించనుంది. ఇప్పటి వరకు ఎనిమిది టీ20 మ్యాచులకు కెప్టెన్‌గా నేతృత్వం వహించిన పాండ్యా.. ఆరు విజయాలు అందించాడు. ఒకదాంట్లో ఓడిన భారత్.. మరో మ్యాచ్‌ను టై చేసుకుంది.
అయితే.. కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా పాండ్యాకు ప్రమోషన్ రావడంతో అటిట్యూడ్ మారిపోయింది. వరుసగా మనోడు చూపిస్తున్న బిల్డప్, అటిట్యూడ్ ని ఫ్యాన్స్ కు చిరాకు తెప్పిస్తుంది. లేటెస్ట్ గా రెండో వన్డేలో శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా వాటర్ బాటిల్ అందించడం ఆలస్యం కావడంతో సహచర ఆటగాడైన వాషింగ్టన్ సుందర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు.
శ్రీలంక ఇన్నింగ్స్ 11 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. పాండ్యాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. ఫస్ట్ వన్డేలో కోహ్లీ డబుల్ తీసే క్రమంలో కూడా హార్దిక్ ప్రవర్తన ఫ్యాన్స్ కు చిరాకు తెప్పించింది. కోహ్లీ రెండో పరుగుకు పిలిచినా.. హార్దిక్ రెస్పాండ్ కాలేదు. ఆ సమయంలో కోహ్లీ కూడా హార్దిక్ పై సీరియస్ అయ్యాడు.
ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లోనూ ఇలానే వ్యవహరించాడని గుర్తు చేస్తున్నారు. టీ20 సిరీస్ లో కూడా కామేంటటర్లు అడిగిన ప్రశ్నలకి తలతిక్క సమాధానమిచ్చాడు. అలాగే.. గతేడాది ఇంగ్లండ్ టూర్ లో కూడా ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మపై సిరీస్ అయ్యాడు హార్దిక్. ఫీల్డింగ్ మార్పుల విషయంలో రోహిత్ పై నోరు పారేసుకున్నాడు.