వయస్సు, ఫిట్ నెస్ దృష్టిలో పెట్టుకుంటే శిఖర్ ధావన్.. ఈ ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. 2022 ఏడాదిలో ధావన్ చాలా సందర్భాలలో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.. గతేడాది వన్డేల్లో 22 ఇన్నింగ్స్‌ల్లో 34 సగటుతో 688 పరుగులు చేశాడు. 6 అర్ధ సెంచరీలు చేశాడు. అయితే.. ఈ సమయంలో సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. (AP)
ఇటీవల బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు రాహుల్ కెరీర్ కూడా డేంజర్ జోన్ లో పడింది. 2022లో.. 9 ODI ఇన్నింగ్స్‌లలో 28 సగటుతో 251 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2 అర్ధ సెంచరీలు సాధించాడు. 73 పరుగులే అత్యుత్తమ స్కోరు. టీ20 ప్రపంచకప్‌లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. (AP)
శ్రీలంకపై ప్రకటించిన టీ20 జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. అలాగే.. వన్డే సిరీస్ లో వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. అంటే బీసీసీఐ ఓ విధంగా రాహుల్ ని హెచ్చరించింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే రాహుల్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. అంటే.. కేఎల్ రాహుల్ కి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఇషాన్ కిషన్ రెండో వికెట్ కీపర్. ఇక్కడ కూడా ఇషాన్దే పైచేయి. ఇటీవల బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. (AP)
24 ఏళ్ల ఇషాన్ కిషన్.. 2022లో 7 వన్డేల్లో 60 సగటుతో 417 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాదాడు. 210 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే ప్రతి సెకండ్ ఇన్నింగ్స్‌లో 50కి పైగా స్కోరు చేస్తున్నాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. అతను 110 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. (AP)
ఇక, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. భువీ.. గతేడాది T20 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడాడు. కానీ పేలవ ప్రదర్శన కారణంగా శ్రీలంకతో జరిగిన రెండు సిరీస్‌లలో అతనికి చోటు దక్కలేదు. 32 ఏళ్ల భువనేశ్వర్ 2022లో కేవలం 2 వన్డేల్లో మాత్రమే ఆడాడు. ఒక్క వికెట్ కూడా పడలేదు. అదే సమయంలో 32 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. (AP)
లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కి కూడా ఇది చివరి అవకాశం అని తెలుస్తుంది. కుల్దీప్ యాదవ్ రూపంలో చాహల్ కి గట్టీ పోటీ తప్పేలా లేదు. ఈ మధ్య కాలంలో కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రతి ఫార్మాట్ లోనూ సత్తా చాటుతున్నాడు. కానీ, చాహల్ నుంచి ఆ ప్రదర్శన కరువైంది. అలాగే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.