పింక్ టెస్ట్ (IND vs SL Pink Test) లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు టెస్టుతో రోహిత్ శర్మ తన లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ తన కెరీర్ లో 44 టెస్టులు, 250 వన్డేలు, 125 టి20 మ్యాచ్ లు ఆడాడు. అంటే మొత్తం 399 మ్యాచ్ లు ఆడాడు. బెంగళూరు టెస్టుతో 400వ అంతర్జాతీయ మ్యాచ్.
అయితే ఈ విషయంలో కోహ్లి ఉద్దేశాలను అంతాగా పట్టించుకోని బీసీసీఐ.. ఆ మ్యాచ్‌ను షెడ్యూల్ ప్రకారం యధాతథంగా మొహాలీలోనే కొనసాగించి కోహ్లితో పాటు అతని ఫ్యాన్స్‌ను దారుణంగా నిరుత్సాహపరిచింది. ఫస్ట్ ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో కోహ్లి అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో 50 శాతం ప్రేక్షకులకు అనుమతించింది.
ఇదే కోహ్లి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. తమ ఆరాధ్య క్రికెటర్ మైలురాయి టెస్ట్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోగా, 50 శాతం ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోని అనుమతించిన బీసీసీఐ.. రోహిత్ 400వ మ్యాచ్‌ను హైలైట్ (డే అండ్ నైట్, పింక్ బాల్ మ్యాచ్) చేస్తూ 100 శాతం ప్రేక్షకులను అనుమతించడమేంటని మండిపడుతున్నారు.