టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా సరే దూకుడుతో పరుగులు చేస్తుంటాడు. ప్రతి బంతిని బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. శ్రీలంకతో సిరీస్‌లోనూ రిషబ్ పంత్ ఇదే దూకుడుతో చెలరేగాడు. టీ20 తరహా బ్యాటింగ్ తో లంక బౌలర్లకు చుక్కలు చూపాడు.