టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు రాణించారు. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు ఫైటింగ్ టోటల్ సెట్ చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది శ్రీలంక. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, చాహల్, చాహర్ రెండు వికెట్లు తీయగా..భువనేశ్వర్ కుమార్ మాత్రం తేలిపోయాడు.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో లంక బ్యాట్స్ మన్ స్కోరు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. మొదట్లో బాగానే పరుగులు చేసిన లంకేయులు ఆ తర్వాత రన్స్ తీయడానికి ఇబ్బందులు పడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన లంకకు మంచి ఆరంభాన్ని అందించాడు అవిష్క ఫెర్నాండో. తన హిట్టింగ్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఊపు మీదున్న ఫెర్నాండోను దెబ్బ తీశాడు చాహల్ . యజ్వేంద్ర చహల్ వేసిన 10వ ఓవర్ తొలి బంతికి అవిష్కా ఫెర్నాండో(32) ఔటయ్యాడు. కవర్స్ మీదుగా షాట్ ఆడబోయిన ఫెర్నాండో.. మనీష్ పాండేకు నేరుగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఫస్ట్ డౌన్ ఆటగాడు భానుక రాజపక్సా(24 పరుగులు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ తొలి బంతికి రాజపక్సా పెవిలియన్‌కు చేరాడు. కుల్డీప్ వేసిన ఓవర్లో మిడాన్‌లో ధవన్ క్యాచ్ పట్టడంతో భానుకా రాజపక్సా ఔటయ్యాడు. అనంతరం ఓపెనర్ మినోద్ భానుకా(27 పరుగులు) కూడా పెవిలియన్ బాట పట్టాడు. కుల్దీప్ వేసిన అదే ఓవర నాల్గో బంతికి మినోద్ స్లిప్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో లంకేయులు 89 పరుగులు వద్ద మూడో వికెట్లు కోల్పోయింది.
117 పరుగుల వద్ద శ్రీలంక నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ నాల్గో బంతికి ధనంజయ డిసిల్వా(14) ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో భువనేశ్వర్ లాంగాఫ్‌లో క్యాచ్ పట్టడంతో డిసిల్వా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ షనకతో కలిసి చరిత్ అసాలంకా ఇన్నింగ్స్ ని చక్క దిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి ఐదో వికెట్ కు 49 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. అయితే, 38 పరుగులు చేసిన చరిత్ అసాలంకా.. దీపక్ చాహర్ వేసిన స్లో డెలివరీకి కీపర్ ఇషాన కిషాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే షనక కూడా 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖర్లో చమీరా మెరుపులతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.