Virat Kohli : ‘కోహ్లీ ఒక బచ్చా.. సచిన్ తో పోలికా’ సంచలన కామెంట్స్ చేసిన టీమిండియా మాజీ ఓపెనర్
Virat Kohli : ‘కోహ్లీ ఒక బచ్చా.. సచిన్ తో పోలికా’ సంచలన కామెంట్స్ చేసిన టీమిండియా మాజీ ఓపెనర్
Virat Kohli : 2019 నవంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు వెయ్యి రోజులకు పైగా సెంచరీ లేకుండానే గడిపిన కోహ్లీ మళ్లీ శతకాల జాతరను మొదలు పెట్టాడు. ఆసియాకప్ లో అఫ్గాన్ పై సెంచరీ కొట్టి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ సెంచరీలతో అభిమానులను అలరిస్తున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat kohli) సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే.
2/ 8
2019 నవంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు వెయ్యి రోజులకు పైగా సెంచరీ లేకుండానే గడిపిన కోహ్లీ మళ్లీ శతకాల జాతరను మొదలు పెట్టాడు. ఆసియాకప్ లో అఫ్గాన్ పై సెంచరీ కొట్టి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ సెంచరీలతో అభిమానులను అలరిస్తున్నాడు.
3/ 8
తాజాగా శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ కొట్టడంతో అంతర్జాతీయ వన్డేల్లో 45వ సెంచరీని కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు.
4/ 8
సచిన్ తన కెరీర్ లో 49 వన్డే అంతర్జాతీయ సెంచరీలను చేశాడు. ఇక కోహ్లీ సెంచరీపై అటు అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సచిన్ తో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
5/ 8
అయితే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం కోహ్లీపై సెటైర్స్ వేశాడు. సచిన్ తో కోహ్లీని పోల్చకండి అంటూ అభిమానులకు చురకలు అంటించాడు.
6/ 8
సచిన్ ఆడే సమయంలో ఉన్న రూల్స్ ఇప్పుడు లేవని.. ప్రస్తుతం ఉన్న క్రికెట్ రూల్స్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. సచిన్ ఆడేటప్పుడు బౌలర్, వికెట్ కీపర్ తో పాటు మరో ఐదుగురు ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ లోపల ఉండాలనే రూల్ లేదని ప్రస్తావించాడు.
7/ 8
అంతేకాకుండా సచిన్ టైంలో పిచ్ లకు ఇప్పటి పిచ్ లకు చాలా తేడా ఉందని కూడా పేర్కొన్నాడు. సచిన్ తో కోహ్లీని పోలిస్తే అది అవివేకమే అవుతందంటూ గంభీర్ కామెంట్స్ చేశాడు.
8/ 8
ఇక భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే కోల్ కతా వేదికగా గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 1.30లకు ఆరంభం కానుంది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది.