దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. రెండు దేశాల మధ్య (IND vs SA) ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 5 సార్లు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. భారత్ జట్టు ఒకే ఒక్క సిరీస్‌ను మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే ఈసారి కూడా టీమ్ ఇండియా గెలుపు అంత సులువుగా ఏమీ రాదు. ఇందు కోసం చాలా కష్టపడాల్సిందే.
దక్షిణాఫ్రికాపై ఐసీసీ నిషేధం ముగిసిన తర్వాత భారత జట్టు తొలి సారిగా 1992లో వన్డే సిరీస్ ఆడటానికి అక్కడకు వెళ్లింది. 7 మ్యాచ్‌ల సిరీస్‌లో అజారుద్దీన్ నేతృత్వంలోని టీమ్ ఇండియా 2-5 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత 2006లో మరోసారి 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. అప్పుడు 0-4 తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. (AP)
దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలిచిన విదేశీ కెప్టెన్లు ఇద్దరు మాత్రమే. 2018లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించగా.. అందకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తొలి సారిగా వన్డే సిరీస్ గెలచుకున్నాడు. 7 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 5-1 తేడాతో గెలిచింది. పాంటింగ్ ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ అయ్యాడు.(AP)
ఇప్పుడు ఇక రోహిత్ శర్మ వంతు వచ్చింది. దక్షిణాఫ్రికాను వారి దేశంలో ఓడించడం అంత సులభమేమీ కాదు. 2022 జనవరిలో టీమ్ ఇండియా 3 వన్డేల సిరీస్ ఆడనున్నది. రోహిత్ శర్మ తొలి సారిగా టీమ్ ఇండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. స్వదేశంలో న్యూజీలాండ్‌పై 3-0తో టీ20 సిరీస్ గెలిచాడు. అతడి కెప్టెన్సీకి దక్షిణాఫ్రికా పర్యటన పెద్ద సవాలుగా నిలవబోతున్నది. (AP)