టీమిండియా (Team India) మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో (IND vs SA) పర్యటిస్తోంది. విరాట్ కోహ్లి (Virat Kohli) నేతృత్వంలోని భారత జట్టు డిసెంబర్ 26న సెంచూరియన్ టెస్టుతో తన పర్యటనను ప్రారంభించనుంది. టీమిండియా టెస్ట్ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. దీంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే, ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ రెండు అరుదైన రికార్డులపై కన్నేశాడు. తన లో రన్స్ పరంగా ఓ మైల్ స్టోన్ కు దగ్గరయ్యాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో 97 మ్యాచ్లు ఆడాడు కోహ్లీ. 50 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఏకంగా 7 సార్లు డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు.