ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన (India Tour Of South Africa)లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ లో మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక, లేటెస్ట్ గా బీసీసీఐ (BCCI)జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్లో ODI సిరీస్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది.
ఇక, లాంగ్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ.. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే, జట్టు ఎంపికపై భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో కోహ్లీ పేరు పక్కన “సి” (కెప్టెన్) లేకపోవడం తనకు చాలా బాధగా అనిపించిందని చోప్రా అన్నాడు.